ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు గా ముందుకు వెళుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ KNR, ధనుంజయ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కాంతో ఈ ఇద్దరికీ సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ KNR, ధనుంజయ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు జరుగుతున్నాయి.

అటు ఇటీవలే ఏపీ లిక్కర్ స్కామ్ పై తొలిసారి విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు . ఏ రూపాయి నేను ముట్టలేదని వెల్లడించారు విజయసాయి రెడ్డి. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానన్నారు విజయసాయి రెడ్డి.