జమ్ముకాశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేరుగా భారత్ మీద దాడులకు దిగకుండా దాయాది పాకిస్తాన్…ఎల్ వోసీ వెంట అమాయకులైన ప్రజలపై కాల్పులకు తెగబడుతోంది. అయితే, ఇండియన్ ఆర్మీ చేసిన దాడుల్లో సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు.కాసేపటి క్రితమే ఆల్ పార్టీ మీటింగ్ ప్రారంభం అయ్యింది. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సిందూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు, తదితరులు హజరయ్యారు.