జగిత్యాలలో నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్..

-

జగిత్యాల జిల్లాలో నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో జిల్లాలో తాగునీటి కోసం తండ్లాట ఏర్పడింది. వెల్గటూరు మండలం శాఖపూర్‌లో తాగునీరు లేక ప్రజలు తిప్పలు పడుతున్నారు.

నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్ కావడంతో పాటు ట్యాంకర్ ద్వారా రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారని మహిళలు ఆందోళన చెందుతున్నారు. నీళ్లివ్వాలని ఫోన్లు చేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదని.. దగ్గర్లోని ఓ బోర్ వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని మహిళలు ఆరోపిస్తున్నారు. గత పదేండ్లలో ఏనాడూ నీటి సమస్య లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకొచ్చిందంటూ మహిళలు అధికారులను నిలదీస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news