పాకిస్థాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి పెను ప్రమాదమే తప్పింది. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో భారీ పేలుడు సంభవించినట్టు సమాచారం. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారీ పేలుడు జరిగింది. పాక్ రాజకీయ కేంద్రానికి అతి సమీపంలో సంచలన ఘటన గా చెబుతున్నారు.

ఈ ఘటన పాక్ ప్రధాని ఇంటికి కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే జరిగింది. దీంతో షరీఫ్‌ను వ్యక్తిగత సిబ్బంది ఇంటి నుంచి సురక్షిత బంకర్ లోకి తరలించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక గురువారం రాత్రి పాకిస్థాన్ అనేక నగరాలపై సడెన్ క్షిపణి దాడికి పాల్పడింది. జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా స్పందించి, పాక్ క్షిపణులను గాల్లోనే నిలిపేసింది. అధునాతన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో ఈ దాడిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది.