న్యూయార్క్ లో కరోనా కేసులు మరింత పెరిగినట్లు తెలుస్తుంది. దీనితో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రు క్యూమో అత్యవసర పరిస్థితి విధించారు. చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఈ కేసులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. తాజగా న్యూ రోషెల్ లో కరోనా వైరస్ కు సంబంధించి 23 కొత్త కేసులు నమోదు కాగా, అలానే వెస్ట్ చెస్టర్ కౌంటీ లో కూడా వైరస్ సోకినా వారి సంఖ్య 57 కు పెరిగినట్లు తెలుస్తుంది. ప్రావిన్స్ లో కూడా కరోనా కేసులు 76 కి పెరిగాయని,గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని గవర్నర్ క్యూమో తెలియజేశారు. అలానే రాక్ ఏవ్,స్టారో గా కౌంటీలలో కూడా కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కరోనా ప్రభావం 70 దేశాలపై పడింది. ఈ కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెపుతుంది.
చైనా లో మొదలైన ఈ కరోనా ప్రపంచ దేశాలకు పాకి 70 దేశాలను వణికిస్తుంది. చైనా తరువాత అత్యధిక స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఎప్పటికప్పుడు దేశాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా లో కూడా కరోనా కేసులు అధికమవడం తో అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.