పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌కు చెందిన పైలట్‌ను భారత్ ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్‌లో అతడిని కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయాన్నీ నిఘా వర్గాలు స్వయంగా వెల్లడించాయి. కాగా, పాకిస్థాన్ మిసైళ్లు డ్రోన్లతో భారత్ పై దాడి చేస్తూనే ఉన్నాయి.
మరోవైపు పాక్ దాడులను భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పి కొడుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి పెను ప్రమాదమే తప్పింది. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో భారీ పేలుడు సంభవించినట్టు సమాచారం. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారీ పేలుడు జరిగింది. పాక్ రాజకీయ కేంద్రానికి అతి సమీపంలో సంచలన ఘటన గా చెబుతున్నారు.