అనుమానంతో భార్యను గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు భర్త. తరువాత భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి గ్రామానికి చెందిన రాజేష్ (35) సరిత (30) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్య ప్రవర్తనలో తేడా ఉందని అనుమానంతో, కొంతకాలంగా తరచూ సరితతో గొడవపడుతున్నారు రాజేష్.

గురువారం ఇద్దరు కలిసి పెళ్లికి వెళ్లొచ్చిన తరువాత ఇంట్లో మరొక సారి గొడవపడగా.. ఆగ్రహంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసాడు రాజేష్. రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతిచెందిన భార్యను చూసి భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. తల్లిదండ్రులు ఒకేసారి చనిపోవడంతో అనాథలుగా మారారు పిల్లలు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.