మావోయిస్టులకు భారీ రిలీఫ్ దక్కింది. కర్రెగుట్టలో ఆపరేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ అలాగే చత్తీస్గడ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కర్రెగుటల్లో ఉన్న మావోయిస్టులను అంతమొందించేందుకు ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర సర్కార్.

అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆపరేషన్ కగార్ ఇచ్చింది. సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి పంపించింది కేంద్ర ప్రభుత్వం. హెడ్ కోటర్స్ లో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కర్రెగుట నుంచి కేంద్ర బలగాలు హుటాహుటిన వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఊరట లభించింది.
కాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతను ప్రారంభించిన విషయం తెలిసిందే. వారు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ చేపట్టారు.