శ్రీలంక వేదికగా జరిగిన మహిళల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు గర్వించదగిన విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలోని ఆర్‌పిఎస్ మైదానంలో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన తన అద్భుత ఫారాన్ని కొనసాగిస్తూ 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగుల శతకాన్ని నమోదు చేసింది. ఆమెకు తోడుగా హర్లీన్ డియోల్ (47), హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44), దీప్తి శర్మ (నాటౌట్ 20) నిలిచారు. శ్రీలంక బౌలింగ్‌లో మాల్కీ మడారా, దెవ్మి విహంగా, సుగంధిక కుమారి చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ చమారి అథపత్లు (51), నీలక్షిక సిల్వా (48) ప్రయత్నించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ బౌలింగ్ విభాగంలో స్నేహ రానా రాణిస్తూ 4 వికెట్లు తీశింది. అమన్‌జోత్ కౌర్ 3 వికెట్లు, శ్రీ చరణి ఒక వికెట్ తీసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మందాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవగా, సిరీస్ మొత్తంలో అద్భుత ప్రదర్శన చూపిన స్నేహ రానా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచింది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో సెంచరీతో స్మృతి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా చరిత్రలోకి.entry