ఇవాళ ఈడీ విచారణకు మహేష్ బాబు.. మళ్లీ డుమ్మా కొడతాడా ?

-

నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు కానున్నారు. సాయిసూర్య, సురానా ప్రాజెక్టు కేసుల్లో హీరో మహేశ్ బాబును నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయా కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

mahesh babu

గత నెల 28న మహేశ్ బాబు విచారణకు హాజరుకావాల్సి ఉండగా షూటింగ్ కారణంగా రాలేనని తెలిపారు. దీంతో నేడు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు తెలిపారు. కాగా, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నేడు ఈడీ విచారణకు మహేశ్ హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news