నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరి ప్రవర్తన ఒకే విధంగా ఉండదు. కొంతమంది నిద్రపోయినప్పుడు ఎటువంటి కదలిక లేకుండా పడుకుంటారు. మరికొందరు నిద్రలో మాట్లాడుతూ, నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారు నిద్రలో ఎక్కువగా నవ్వుతూ కనిపిస్తారు కానీ చిన్నపిల్లల్లో మాత్రం ఈ లక్షణం తక్కువగా కనిపిస్తుంది. ఇలా నిద్రలో నవ్వడం వలన ఎటువంటి ప్రమాదం లేకపోయినా దీని వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమంది నిద్రపోయినప్పుడు కలల్లో కలిగే భావోద్వేగాల కారణంగా నవ్వుతారు. ఈ సమయంలో కనురెప్పలు వేగంగా కదలుతాయి, అలాగే కళ్లు కదలికలతో పాటు నవ్వుతారు.
కొన్ని సందర్భాల్లో పారాసోమ్నియా వంటి సమస్యలు శరీరంలో ఎక్కువ కదలికలను కలిగిస్తాయి. దీని వల్ల నిద్రలో నవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైనప్పుడు ప్రవర్తనలో మార్పులు కూడా వస్తాయి మరియు ఆ సమయంలో పూర్తిగా పక్షవాతానికి గురికాకుండా ఉంటారు. సహజంగా నిద్రలో నవ్వడం ఒక సమస్య కాకపోయినా, చాలా అరుదుగా స్లీప్ లాఫింగ్ అనే న్యూరాలజికల్ కండిషన్ కొందరిలో కనిపిస్తుంది. దీనికి పార్కింసన్స్ మరియు మల్టిపుల్ క్లేరోసిస్ వంటి సమస్యలు కారణమవుతాయి. అలాగే ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, ఆందోళన లేదా డిప్రెషన్ ఉన్నవారు కూడా నిద్రలో నవ్వుతారు. ఒత్తిడి వల్ల వచ్చే నిద్రలో నవ్వు మరింత తీవ్రంగా ఉంటుంది.
అంతేకాకుండా ఒత్తిడి లేకపోయినా హఠాత్తుగా నిద్రపోతున్న సమయంలో మెదడు తేలికైన కలలను ప్రాసెస్ చేస్తుంది, దీని వలన నిద్రలో నవ్వడం కూడా సాధారణంగా జరుగుతుంది. నిద్రలో నవ్వడానికి జన్యు ప్రభావం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కొంత శాతం మంది నిద్రలో మాట్లాడుతూ, నడుస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఉండే తల్లితండ్రుల పిల్లల్లో కూడా ఇవే కనపడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు మెదడు ఎదుగుదల అయ్యే సమయంలో మరియు జ్ఞాపకశక్తి పెంచుకునే క్రమంలో నిద్రలో నవ్వుతారు. కొన్నిసార్లు మెలకువగా ఉన్నప్పుడు కూడా నవ్వుతారు. సహజంగా నిద్రలో నవ్వడం సమస్య కాదు. అయితే ఒంటరితనం, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, ఒత్తిడి వంటి ఇతర సమస్యలు తీవ్రంగా కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించండి.