భారీ ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి ?

-

మావోయిస్టు దళాలను వెంటాడుతున్నాయి బలగాలు. ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ బోర్డర్ లోని భామ్రాగడ్ అడవుల్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.

More than 30 Maoists reported killed

ఈ తరుణంలోనే 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాలను గుర్తించారు. కాగా కర్రెగుట్టలో ఆపరేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ అలాగే చత్తీస్గడ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కర్రెగుటల్లో ఉన్న మావోయిస్టులను అంతమొందించేందుకు ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర సర్కార్.

అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆపరేషన్ కగార్ ఇచ్చింది. సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి పంపించింది కేంద్ర ప్రభుత్వం. హెడ్ కోటర్స్ లో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కర్రెగుట నుంచి కేంద్ర బలగాలు హుటాహుటిన వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఊరట లభించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news