పాకిస్థాన్ ( PAKITHAN) కీలక ప్రకటన చేసింది. 11 మంది సైనికులు చనిపోయారని పాక్ స్పష్టం చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టాన్ని ఎట్టకేలకు ఒప్పుకుంది పాక్. ఈ ఆపరేషన్‌లో 11 మంది సైనికులు మరణించగా.. మరో 78 మందికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడించింది. మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు స్పష్టం వెల్లడించింది.

వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో మొత్తం 40 మంది పౌరులు చనిపోగా.. 121 మందికి గాయాలు అయ్యాయి. ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారుగా సమాచారం అందుతోంది.