కరోనా ప్రభావం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పడిపోతుంది.దీనితో పసిడి ప్రేమికులు బంగారం కొనడానికి ఉత్సహం చూపిస్తున్నారు..వరుసగా మూడో రోజు కూడా పసిడి ధర పడిపోయింది.అదే విధముగా వెండి ధర కూడా తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,330 తగ్గుదలతో రూ.43,850కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,120 తగ్గుదలతో రూ.40,200కు పడిపోయింది.పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.370 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.48,030కు క్షీణించింది.
ఇకపోతే దేశ రాజధానిలో ఢిల్లీ లో ధరలు చూస్తేపసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర రూ.1,150 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గుదలతో రూ.41,050కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,150 క్షీణతతో రూ.42,250కు పడిపోయింది. ఇక వెండి ధర రూ.370 తగ్గుదలతో రూ.48,030కు తగ్గింది.