క్రిష్ .. పవన్ కళ్యాణ్ ని ముంచేస్తాడాంటున్నారేంటి …ఇది నిజమేనా ..?

-

పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మే 15 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు అన్నీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా తో పాటు ( జాగర్లమూడి రాధాకృష్ణ ) క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రీసెంట్ గా ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారట. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవన్ – అనసూయ ఇతర బృందంపై ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణ జరిగిందని తాజా సమాచారం.

 

పీరియడ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కంప్లీటయ్యో సరికి ఈ బడ్జెట్ 250 కోట్లు కూడా ఈజీగా దాటే అవకాశముందని తెలుస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన విషయంలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. పవన్ మార్కెట్ ప్రకారం వర్క్ అవుట్ అవుతుందా అంటూ క్రిష్ ని .. నిర్మాత అడుగుతున్నారట. ఒకరకంగా ఇది క్రిష్ మీద ఉన్న అపనమ్మకం అనే అర్థమవుతుంది.

అందుకు కారణం లేకపోలేదు. క్రిష్ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ బయోపిక్ అయినప్పటికి పెద్ద డిజాస్టర్స్ గా మిగలడం కంప్లీట్ గా ఇది క్రిష్ ఫేయిల్యూర్ అంటూ ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయపడ్డారట. బాలీవుడ్ లో మణికర్ణిక సినిమాని క్రియోటివ్ డిఫ్రెన్స్ వల్ల మద్యలో వదిలేసి వచ్చాడు. అయినా పవన్ కళ్యాణ్ ఏ రకంగా క్రిష్ కి ఛాన్స్ ఇచ్చాడు అంటూ చాలామంది సందేహాలని వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే క్రిష్ .. పవన్ కళ్యాణ్ మి ముంచేసినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా రిలీజయ్యాక ఏం జరుగుతుందో ..!

Read more RELATED
Recommended to you

Latest news