Telangana: ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య

-

ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య సంఘటన మెదక్ లో జరిగింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి భర్తను చంపి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది భార్య. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను భార్య లత, అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనేక సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా, పద్ధతి మార్చుకోలేదు లత.

aunty

ప్రియుడితో కలిసి తన భర్త అడ్డును తొలిగించాలని, అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి భర్తను హతమార్చమని చెప్పింది లత. పథకం ప్రకారం ఈ నెల 16న మద్యం సేవిద్దామంటూ శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టి హత్య చేసింది మోహన్. ఈ నెల 28వ తేదీన తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది లత.
పోలీసులు విచారణ చేస్తుండగా, అనుమానంతో నిలదీయగా తామే హత్య చేశామని అంగీకరించాడు లత ఆమె ప్రియుడు మల్లేష్. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news