రేవంత్ రెడ్డికి షాక్.. HCU భూముల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. HCU కంచే గచ్చిబౌలి భూముల విషయంలో మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సీరియస్ అయ్యారు. HCU కంచె గచ్చిబౌలిలో అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ మరియు అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. HCU కంచె గచ్చిబౌలి భూమలపై విచారణ సందర్భంగా CJI కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నీ సక్రమంగా ఉంటే సెలవులున్న సమయంలో ఎందుకు పని ప్రారంభించారు ? సోమవారం చేసుకోవచ్చు కదా ? వేల చెట్లు అక్రమంగా కొట్టేశారు అవన్నీ త్వరగా పునరుద్ధరణ చేయాలని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగించారు.. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టు కనిపిస్తుందని తెలిపారు. తదుపరి విచారణను జూలై 23వ తేదీకు వాయిదా వేసింది ధర్మాసనం.