చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను అందరికి తెలియజేశాడు. అటువంటి నియమాలను పాటించడం వలన జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. పైగా జీవితంలో విజయం సాధించాలంటే చాణక్య నీతి సూత్రాలను కచ్చితంగా అనుసరించాల్సిందే. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం, అర్థశాస్త్రం, పంచతంత్ర వంటి పుస్తకాల ద్వారా ఎన్నో విలువైన విషయాలను అందించారు. వాటిని పాటించడం వలన మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందితో స్నేహం చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మరికొంత మంది వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వలన జీవితంలో విజయాన్ని అస్సలు సాధించలేరు అని చాణక్యుడు చెబుతున్నాడు.
చాణక్యుడు ప్రకారం, ఎవరైతే మూర్ఖులతో ఎక్కువ సమయం గడుపుతారో వారు సరైన నిర్ణయాలను తీసుకోలేరు. తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం వలన జీవితం పై తీవ్ర ప్రభావం పడుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారో మరియు పనుల్లో తప్పులను మాత్రమే వెతుకుతారో అటువంటి వ్యక్తులతో ఎంతో దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి ప్రతికూల స్వభావం ఉంటుంది. దాని వలన మీ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు.
కొంతమంది స్త్రీలు తనను తానే పొగుడుకొని, అందరికంటే ఉత్తమురాలిగా భావిస్తారు. అటువంటి స్త్రీలకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలాంటి స్త్రీలు అబద్ధం ఎక్కువగా చెబుతారు. దాని వలన మిమ్మల్ని బాధ పెట్టడానికి వెనకాడరు. కనుక అబద్ధాలు చెప్పే వారితో స్నేహం చేయకపోవడమే మేలు. కనుక ఇటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది అని చాణక్యుడు చెబుతున్నాడు. ఈ విధంగా జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా విజయాలను పొందాలంటే ఇటువంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మేలు.