హరీశ్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి హుటాహుటిన గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావుతో ఏకంగా రెండు గంటల పాటు కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

KTR, harish rao

గత కొన్ని రోజులుగా హరీష్ రావు పై కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మారతాడని… బిజెపిలోకి వెళ్తాడని కూడా కొంతమంది ప్రచారం చేశారు. అయితే దీనిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చి తాను… కల్వకుంట్ల తారకరామారావు, కెసిఆర్ తోనే ఉంటానని ప్రకటించారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే… హరీష్ రావు ఇంటికి హుటాహుటిన కేటీఆర్ వెళ్లడం జరిగింది. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకే కేటీఆర్ ఇలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news