ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.
కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఫ్రీ బస్సు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా… ఏపీలో ఫ్రీ బస్సు పథకాన్ని మాత్రం అమలు చేయలేక పోయింది ప్రభుత్వం. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వివరించారు. దీనిపై త్వరలోనే విధివిధానాలు రాబోతున్నాయి.