పాత బస్తిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో .. మృతుల సంఖ్య 17కి చేరింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…విచారణ చేస్తున్నారు.

ఈ ప్రమాదం పైన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. పాతబస్తీ మీర్ చౌక్ లో… భారీ అగ్ని ప్రమాదంలో… పలువురు మరణించడం… తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని…అధికారులను ఆదేశించానని వెల్లడించారు.