కాంట్రాక్ట్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త… ఆ గడువు పెంపు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్టు టీచర్లకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లో టీచింగ్ చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు శుభవార్త అందించింది. వాళ్ల కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. మొత్తం 282 మంది టీచర్ల సేవలను పునరుద్ధరించేందుకు… నిర్ణయం తీసుకుంది.

మరో ఏడాది కాలం పాటు వాళ్ళ కాంట్రాక్టు ను రెన్యువల్ చేసేందుకు అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. మొత్తం ఈ 282 మందిలో 211 మంది పిజిటిలు ఉన్నారు. మరో 71 మంది ఇతరులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ రెన్యూవల్ ద్వారా లబ్ధి చేకూరాలని ఉంది. పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీలకు కూడా అనుమతి ఇచ్చింది చంద్ర బాబు కూటమి ప్రభుత్వం.
ఇంకా ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news