కమ్మ భవన్‌లో కలకలం చోటు చేసుకుంది. మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కమ్మ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యే ముందే ఆత్మహత్యాయత్నానికి కార్యకర్త పాల్పడ్డాడు. అనంతపురం కమ్మ భవన్‌లో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముందే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు టీడీపీ కార్యకర్త వెంకటేష్.

పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని, గెలిచాక తనను ఎవరు పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు టీడీపీ కార్యకర్త. పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త వెంకటేష్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా టీడీపీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయగా.. ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు. కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తునాన్రు. మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు టీడీపీ మహానాడు జరగనుంది.
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం మినీ మహానాడులో ఎమ్మెల్యే ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ కార్యకర్త వెంకటేష్
పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని పురుగుల మందు తాగిన కార్యకర్త
చికిత్స కోసం వెంకటేష్ ను ఆసుపత్రికి తరలింపు #Mahanadu2025… pic.twitter.com/WbQaOPO5y2
— BIG TV Breaking News (@bigtvtelugu) May 20, 2025