హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా పాతబస్తీ ఛత్రినాక లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దింతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈ పాతబస్తీ ఛత్రినాక లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మొన్న పాత బస్తిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో .. మృతుల సంఖ్య 17కి చేరింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో నుండి ఎగసిపడుతున్న మంటలు pic.twitter.com/yLSUykwZw4
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2025
- హైదరాబాద్ లో ఆగని అగ్ని ప్రమాదాలు
- పాతబస్తీ ఛత్రినాక లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం
- భారీగా ఎగసిపడుతున్న మంటలు
- స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది