వడగళ్ల వర్షం దెబ్బకు ..విమానం ముందు భాగం ధ్వంసమైంది . ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షం వల్ల విమానం ముందు భాగం దెబ్బతినడంతో భయాందోళనతో కేకలు వేశారు ప్రయాణికులు.

అయితే, సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది విమానం. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం గానే ఉన్నారు.
అటు ఢిల్లీలో భారీ వర్షం కారణంగా మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలిపోయి వీధులన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-గురుగ్రామ్ వంటి కీలక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.