అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభించారు ప్రధాని మోదీ. రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్‌లో.. ఏపీలోని సూళ్లూరుపేటలో అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభించారు ప్రధాని మోదీ.

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్లలో పని చేయబోయేది మొత్తం మహిళలే అన్నారు కిషన్ రెడ్డి. పురాతనమైన బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చి ప్రధాని మోదీ అందుబాటులోకి తెచ్చారు.. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనేది కేంద్ర నిర్ణయం అన్నారు.
–