తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడు జరుగుతాయో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సర్పంచ్ ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం అందుతుంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు… త్వరగా అమలు కావాలంటే సర్పంచులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం సర్పంచ్లకు అధికారులు లేకుండా పోయాయి. దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయినట్లే అని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే ఎన్నికలు నిర్వహించి.. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని… అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అయితే ఈ బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్తుందో చూడాలి.