హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలెర్ట్. పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ… ఇటీవల పెంచిన హైదరాబాద్ మెట్రో చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ… ఈ మేరకు చార్జీలు విడుదల చేసింది.

- సవరించిన మెట్రో రైల్ ఛార్జీలు
- రేపటి నుండి అమలు
- రెండు కిలోమీటర్ల వరకు 11 రూపాయలు
- 2నుంచి 4 కిలోమీటర్ల వరకు 17 రూపాయలు
- 4నుంచి 6 కిలోమీటర్ల వరకు 28 రూపాయలు
- 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 37 రూపాయలు
- 9నుంచి 12 కిలోమీటర్ల వరకు 47 రూపాయలు
- 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 51 రూపాయలు..
- 15నుంచి 18 కిలోమీటర్ల వరకు 56 రూపాయలు..
- 18నుంచి 21 కిలోమీటర్ల వరకు 61 రూపాయలు..
- 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 65 రూపాయలు..
- 24 నుంచి ఆపై కిలోమీటర్ల కు 69 రూపాయలు..