Saraswati River Pushkaram to end today: సరస్వతీ నది పుష్కరాల వెళ్లేవారికి అలెర్ట్. సరస్వతీ నది పుష్కరాలు.నేటితో ముగియనున్నాయి. . ఇవాళ రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగిస్తారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

సా. 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. రాత్రి 7:46 నుండి 7:54 వరకు డ్రోన్ షో ఉంటుంది. సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు మంత్రి సీతక్క. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాటాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రకటించారు మంత్రి సీతక్క.