Indiramma Housing Sanction List,Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పై కీలక ప్రకటన వచ్చింది. ఈ పథకం కింద సొంతింటి కల నెరవేరేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సంక్షేమ పథకం అమలు చేసేందుకు ఇవ్వాళ 13 కోట్లు విడుదల చేయబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మొత్తం నిధులను 1300 మంది ఈ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు.

బేస్ మెంట్ స్థాయిలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు అందుతుంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… నిర్మాణం చివరి దశలో ఉన్న ఇండ్లను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 లక్షల లోపు ఇండ్ల నిర్మాణం అయ్యేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంటు అలాగే ఐరన్ తక్కువ ధరకు అందించేలా కసరత్తులు చేస్తోంది.