కరోనా వైరస్ నేపధ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక భక్తుడు కరోనా లక్షణాలతో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే అశ్వని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపధ్యంలోనే తాజాగా అలిపిరి ఘాట్ రోడ్ ని అధికారులు మూసివేసారు. శ్రీవారి ఏకాంత సేవలని యధాతధంగా నిర్వహించనున్నారు అధికారులు.
టీటీడీ అధికారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. తిరుమల నడకదారిని కూడా అధికారులు మూసివేసారు. తిరుపతి నుంచి కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్ ని కూడా అధికారులు మూసి వేసారు. కాసేపట్లో దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.