ఏపీలో కరోనా కల్లోలం చోటు చేసుకుంది. ఏపీలో మరో మూడు కరోనా కేసులు నమోదు అయింది.. ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. ఇక ఏపీలో కరోనా సోకిన ఓ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అటు కరోనా కేసుల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించింది ఏపీ ప్రభుత్వం. మహానాడు కోసమే ఉత్తర్వులు జారీ అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నారు. కాగా.. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసింది ప్రభుత్వం.
- ఏపీలో మరో మూడు కరోనా కేసులు నమోదు..
- ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ
- విషమంగా వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి
- వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు