ఎన్‌డీఎస్ఏకు సంచలన లేఖ రాసింది ఎల్&టీ సంస్థ. మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని, పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ ఎన్‌డీఎస్ఏకు లేఖ రాసిన ఎల్&టీ సంస్థ.. ఎన్‌డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాలని, పరీక్షలు చేయకుండా బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేమని పేర్కొంది.

కానీ గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని నివేదికలో పలు చోట్ల పేర్కొంది, పరీక్షలు చేయనప్పుడు నివేదిక ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించిన ఎల్&టీ సంస్థ.. నివేదికలోని పేజీ–283లో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించిన నివేదికను ఎల్&టీ సమర్పించిందని పేర్కొంటూనే పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రస్తావించారని ఎన్‌డీఎస్ఏను ప్రశ్నించింది. బ్యారేజ్ పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి ఎన్‌డీఎస్ఏకు, నీటిపారాదుల శాఖకు లేఖ రాశామని, పరీక్షలు చేయకుండా బ్యారేజీలో వైప్ల్యలం ఉందని నివేదిక తయారు చేయడం సరికాదని లేఖలో పేర్కొంది ఎల్&టీ సంస్థ.