తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా గద్దర్ అవార్డులు ప్రకటిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

అలాగే మొదటి ఉత్తమ చిత్రంగా… ప్రభాస్ నటించిన కల్కి నిలిచింది. రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేలు నిలవడం జరిగింది. మూడవ ఉత్తమ చిత్రం గా లక్కీ భాస్కర్ సినిమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఈ మేరకు టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ అధికారిక ప్రకటన చేశారు.
గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి
రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్
మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం