తెలంగాణ యూత్ కు షాక్.. నేడు ప్రారంభించాల్సిన ‘యువవికాసం’ వాయిదా !

-

తెలంగాణ యూత్ కు షాక్.. నేడు ప్రారంభించాల్సిన ‘యువవికాసం’ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. రాజీవ్ యువవికాసం మరింత ఆలస్యమయే అవకాశం ఉంది. ఇప్పటికే రేపటినుంచే రాజీవ్ యువ వికాసం రుణ మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం… నేడు ప్రారంభించాల్సిన ‘యువవికాసం’ వాయిదా వేసినట్లు సమాచారం. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని.. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు మంత్రులు.

telangana,yuva vikasam scheme
Yuvavikasam to be launched today postponed

ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు మంత్రులు. రాజీవ్ యువ వికాసానికి ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకువెళ్లారు మంత్రులు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అనర్హులకు సంక్షేమ పథకాలు అందకూడదని ‘యువవికాసం’ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news