ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా సాధారణంగా మారిపోతున్నాయి. వీటిని గ్రహించకుండానే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేయడం, సరైన ఆహారాన్ని తీసుకోవడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎప్పుడైతే గుండె ఆరోగ్యం దెబ్బతింటుందో, గుండెపోటు లేదా మినీ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మెదడులో రక్తం గడ్డకట్టడం లేదా రక్త ప్రవాహం దెబ్బతింటే తాత్కాలికంగా మినీ స్ట్రోక్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిపుణుల ప్రకారం మినీ స్ట్రోక్ వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు, ఒక సంవత్సరం లోపు, పెద్ద స్ట్రోక్ ఎదుర్కొనే అవకాశముంది. నిద్రలేమి వల్ల మినీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రతి రోజు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. కాలుష్యం కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. కాలుష్యంలో ఉండే సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు రక్త ప్రవాహం పై ప్రభావం చూపుతాయి, దీంతో స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. గట్ హెల్త్ దెబ్బతింటే జీవక్రియ సమస్యలు తలెత్తుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తంలో చక్కర నియంత్రణ పై ప్రభావం చూపుతాయి. దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎన్నో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లక్షణాలు కనబడితే, డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. ఈ విధంగా మినీ స్ట్రోక్ వంటి సమస్య లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా జీవనశైలి లో మార్పులను చేసుకుని దీర్ఘ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.