శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. చాలామంది ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు, దీని వల్ల ఆందోళన పెరిగి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహారం తీసుకోవడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా, మన చుట్టూ ఉండే వాతావరణం మనసుకు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతాయో, శరీరానికి డీటాక్స్ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి డీటాక్స్ అవసరమని కొన్ని లక్షణాలు కనపడతాయి. అటువంటి సంకేతాలు కనిపించినప్పుడు తగిన చర్యలను తీసుకోవాలి.
మానసికంగా మాత్రమే కాకుండా, శరీరానికి కూడా డీటాక్స్ అవసరం. ముఖ్యంగా జీర్ణ ప్రక్రియకు సంబంధించిన డీటాక్స్‌ను కచ్చితంగా చేయడం వలన, శరీరం నుండి విషపదార్థాలు బయటకు వెళ్తాయి. సహజంగా విశ్రాంతి తీసుకున్నా అలసటను ఎదుర్కొంటే, శరీరంలో విషపదార్థాలు చేరాయి అని అర్థం చేసుకోవాలి. శరీరంలో కాలేయం మరియు మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగితే, శరీరంలో జరిగే ప్రక్రియలు మందగిస్తాయి. పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ద్వారా శరీరం డీటాక్స్ అవుతుంది. కొంతమందిలో మెదడు మందగించడం వంటివి ఏర్పడతాయి.
అటువంటి సందర్భాలలో ఒమేగా-3 పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండి, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. కనుక శారీరకంగా మరియు మానసికంగా డీటాక్స్ చేయడం ఎంతో అవసరం. డీటాక్స్ కు గ్రీన్ టీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది మరియు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు మరియు విషపదార్థాలను తొలగించడానికి పసుపు, వేపా వంటి పదార్థాలు ఎంతో సహాయపడతాయి. దీంతో శరీరం నుండి విషపదార్థాలు తొలగితాయి. ఇటువంటి మార్పులను చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.