90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం…!

-

అత్యాచార ఘటనలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. ఆడవారు అయితే చాలు వయసుతో సంబంధం లేకుండా ఏమైనా చేయవచ్చు అని ఆలోచించే క్రూర మృగాలు ఎంతో మంది ఉన్నారు. రోజు రోజుకి స్త్రీలపై విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్ నగరంలో 90 ఏళ్ల వృద్దురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.

90-year-old woman raped
90-year-old woman raped

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి యాచారం మండల పరిధిలోని ఓ గ్రామంలో 90 ఏళ్ల వద్దురాలు తన ఇంట్లో నివాసం ఉంటుంది. అర్ధరాత్రి పడుకున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారు. గురువారం ఉదయం స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అత్యాచారం చేసిన దుండగులను పట్టుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news