తెలంగాణ బీసీలకు శుభవార్త.. ఇకపై ఉచిత శిక్షణ అందించనున్నారు. బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 16 నుంచి జులై 8 లోపుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

జులై 12న పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశం పొందిన వారికి వసతి, రవాణాకు స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు… లక్ష ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్శ్ అభియాన్ పథకం కింద గిరిజనులకు లక్ష ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 72,000 సహాయాన్ని… అందిస్తోంది. మిగతా డబ్బులు తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. ఇందిరమ్మ ఇళ్ల నివాసానికి… ఒక్కో ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తోంది. ఇందులో కేంద్ర సహాయము కూడా ఉంటుంది.