వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..చేశారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మా ఫోన్లు ట్యాప్ చేశారని బాంబు పేల్చారు వైఎస్ షర్మిల. ఫోన్ ట్యాపింగ్ అప్పటి తెలంగాణ, ఏపీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మా ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు చేశారు.

మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి మరీ చెప్పారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరగాలి.. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. హైదరాబాద్ లోనే ట్యాప్ చేశారంటూ షర్మిల ఆరోపణలు చేశారు. తను ఎవరెవరితో మాట్లాడుతున్నారన్నది ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేశారని అనుమానాలు వ్యక్తం చేశారు.