తెలంగాణ రాష్ట్రం మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది మహిళా మంత్రి సీతక్క. ఇక మహిళలకు బస్ డ్రైవింగ్ లో కూడా శిక్షణ అందిస్తామని… కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్న సరిత మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సరితను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి, అభినందించారు. ఇకపై సెల్పు ద్వారా మహిళలకు బస్సు డ్రైవింగ్ లో శిక్షణ కూడా అందిస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి సీతక్క. భారీ వాహనాల డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం… కూడా ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ ఆర్టీసీలో మహిళలను రిక్రూట్మెంట్ చేసుకుంటామని… ఆ దిశగా అడుగులు వేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
Empowering Telangana’s daughters! SERP & MOWO launch free heavy vehicle driving training for women. Saritha Nayak, TGSRTC’s 1st woman driver, named role model. A bold step toward women’s empowerment! #WomenInDriving #TelanganaPride pic.twitter.com/cRSiAo2jQI
— Danasari Seethakka (@seethakkaMLA) June 18, 2025