తెలంగాణ, ఏపీలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

-

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఇటు ఉత్తర అలాగే అటు దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

నిజామాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్ మహానగరం, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, అలాగే మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news