ఏపీలో వర్షాలే పడటం లేదు. ఏపీలో వర్షాల కోసం గ్రామస్థులు కప్ప తల్లి ఆటలు ఆడుతున్నారు. రోకలికి కప్పని కట్టి ఊరేగింపులు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం వెలగాడ గ్రామంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకుంటూ కప్ప తల్లి ఆటలు ఆడారు గ్రామస్థులు.

రోకలి బండకు కొత్త గుడ్డలో ఒక కప్పను కట్టి, దానిని రోకలిబండ మధ్యలో వేలాడదీసి, ఆ కప్పను పసుపు, కుంకుమలతో అలంకరించి ఊరేగించారు గ్రామస్థులు. ఇండ్ల వద్దకు వచ్చిన కప్ప తల్లికి బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు మహిళలు. కరువు సంభవించినప్పుడు గ్రామదేవతను పూజించి కప్ప తల్లి ఆడితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు గ్రామస్థులు.
https://twitter.com/TeluguScribe/status/1935960511914361067