సెప్టెంబర్ లో యోగా సూపర్ లీగ్ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

చరిత్ర సృష్టించాలన్న, రికార్డులు బ్రేక్ చేయాలన్న నరేంద్ర మోదీకే సాధ్యం అని తెలిపారు సీఎం చంద్రబాబు. అటు యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోదీ అన్నారు పవన్ కళ్యాణ్. భారతీయ సనాతన ధర్మం విశిష్టను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని మోదీది.. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవం అని తెలిపారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని కోరారు పవన్ కళ్యాణ్.