తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచనతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

భద్రాద్రి, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈరోజు అదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.