ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించి అభిమానుల మనసులను దోచుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్ వెకేషన్ కి వెళ్ళింది.

అక్కడ తన కుమారుడు, భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాకుండా అందులో కాజల్ అగర్వాల్ బికినీ ధరించి స్విమ్మింగ్ చేస్తూ హాట్ గా కనిపించింది. ఆ ఫోటోలను చూసిన కాజల్ అభిమానులు చాలా అందంగా, హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయి కుమారుడు ఉన్నప్పటికీ ఏమాత్రం తరగని అందం ఫిట్నెస్ నీ సొంతం అని అంటున్నారు. ప్రస్తుతం కాజల్ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భాష సినిమాలలో అవకాశాలను అందుకుంటు బిజీ లైఫ్ కొనసాగిస్తోంది.
View this post on Instagram