తెలంగాణకు రెడ్ అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు…!

-

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

rain
rain

అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులకు నివేదికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news