పిల్లల చర్మ ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే.. ఈ చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి..!

-

సహజంగా పిల్లలు ఎక్కువ సమయాన్ని బయట గడుపుతూ ఉంటారు. సూర్యరశ్మి మరియు కాలుష్యం వలన పిల్లల చర్మం ఎంతో త్వరగా టాన్ అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు ఎన్నో చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో చిట్కాలను ప్రయత్నించినా సరే ట్యాన్ త్వరగా పోదు. దానికి బదులుగా సులభమైన చిట్కాలను పాటించి ఎంతో త్వరగా ట్యాన్ ను తొలగించవచ్చు. పిల్లల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి. వీలైనంతవరకు పిల్లలను నీడలో ఉంచాలి. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఇంట్లోనే ఆడుకునే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా తగినంత నీరు తప్పకుండా తీసుకునే విధంగా చూసుకోవాలి.

సహజంగా తల్లిదండ్రులు పిల్లలకు ముదురు రంగు బట్టలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వలన శరీరం ఎంతో త్వరగా వేడిని గ్రహిస్తుంది. కనుక వీలైనంతవరకు లేత రంగులో ఉండే దుస్తులను ఉపయోగించాలి మరియు పొడవైన చేతులు, కాళ్లు కప్పి ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ఎప్పుడైతే పిల్లలు ట్యాన్ అవుతారో, కలబంద గుజ్జును ఉపయోగించవచ్చు. ట్యాన్ అయిన చర్మం పై కలబంద గుజ్జును రాయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా టమాటో గుజ్జును కూడా టాన్ తొలగించడానికి ఉపయోగించవచ్చు. టమాటో లో ఉండే లైకోపీన్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాంతివంతమైన చర్మాన్ని పొందాలంటే ఈ చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి.

ఇంట్లో ఎంతో సులభంగా ట్యాన్ తగ్గించడానికి చల్లటి పాలను తీసుకుని దానిలో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఎంతో త్వరగా ట్యాన్ ను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పెరుగు మరియు సెనగపిండిని ఉపయోగించి ట్యాన్ ను తగ్గించుకోవచ్చు. ఇటువంటి చిట్కాలను పాటించటంతో పాటు కచ్చితంగా సన్‌ స్క్రీన్‌ను ఉపయోగించాలి. పిల్లలు బయటకు వెళ్లే ముందు సన్‌ స్క్రీన్‌ను తప్పకుండా ఉపయోగించడం వలన ట్యాన్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాకుండా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి రీ-అప్లికేషన్ కూడా చేయాలి. ఇలా చేయడం వలన ట్యాన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news