పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఫుడ్స్ ను పెడితే ఆరోగ్యం దెబ్బతిన్నట్టే..!

-

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు ఎంతో సున్నితంగా ఉండడం వలన, ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ పెడితే కానీ వారు ఆరోగ్యంగా ఉండరు. కనుక కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. పిల్లలు అందరికీ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల లంచ్ బాక్స్ విషయంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లులు పిల్లలకు నచ్చేటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడానికి కష్టపడుతూ ఉంటారు.

అయితే పిల్లలు ఆరోగ్యం కోసం లంచ్ బాక్స్‌లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పెట్టడం వలన వారి ఎదుగుదల బాగుంటుంది మరియు ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఉంటారు. కనుక లంచ్ బాక్స్‌లో భాగంగా ఈ ఆహార పదార్థాలను అసలు పెట్టకుండా చూసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఇన్స్టంట్ నూడిల్స్‌ ను అస్సలు పెట్టకూడదు. వాటి వలన జీర్ణ ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. వేయించిన ఆహార పదార్థాలను ఎంతో త్వరగా చేయవచ్చు, అయితే వాటివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.కనుక డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలను లంచ్ బాక్స్‌లో ఇవ్వకపోవడమే మేలు.

పిల్లలకు ప్రాసెస్ చేసినటువంటి ఆహారాన్ని అస్సలు ఇవ్వకూడదు. లంచ్ బాక్స్‌లో భాగంగా చిప్స్, కుకీలు, నూడిల్స్ వంటివి ఇవ్వడం వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వీటిలో సోడియం, కొవ్వులు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ వంటివి అధికంగా ఉంటాయి. కనుక వీటిని ఇవ్వకపోవడమే మేలు.ఇంట్లో తయారుచేసిన వెజిటేబుల్ రైస్, దోస, ఉప్మా వంటి తాజా ఆహారాన్ని పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టాలి. వీటితో పాటుగా అరటిపండు, ఆపిల్, నారింజ వంటి తాజా పండ్లు పెట్టాలి. అంతేకాకుండా ప్రోటీన్ కోసం పన్నీర్ ముక్కలు, గుడ్లు, నట్స్ వంటివి ఇవ్వడం వలన సరైన మోతాదులో ప్రోటీన్ కూడా అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news