తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడింది. ఈ ఎఫెక్ట్ కారణంగా మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది వాతావరణ శాఖ.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ మహానగరానికి కూడా వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు.. వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ.